భారతదేశపు ప్రముఖ ఏఐ బేస్డ్ లోకల్ లాంగ్వేజ్ టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, డైలీహంట్, జోష్, మాగ్జటర్, నెక్స్‌వర్స్.ఏఐల మాతృ సంస్థ అయిన వెర్స్ ఇన్నోవేషన్ (VerSe Innovation).. తమ బోర్డులో ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా పి.ఆర్. రమేష్‌ను నియమించినట్లు ప్రకటించింది. సంస్థాగత మరియు వ్యూహాత్మక వృద్ధిలో.. తదుపరి దశ వైపు కంపెనీ పురోగమిస్తున్న తరుణంలో, ఆయన ఆడిట్ కమిటీ ఛైర్మన్‌గా కూడా వ్యవహరిస్తూ, కంపెనీ పాలనా నిర్మాణాన్ని బలోపేతం చేస్తారు.
రమేష్ ఫైనాన్షియల్ పర్యవేక్షణ, కార్పొరేట్ గవర్నెన్స్, రెగ్యులేటరీ సలహా.. బోర్డు నాయకత్వంలో 40 సంవత్సరాలకు పైగా అనుభవం ఉన్న చార్టర్డ్ అకౌంటెంట్. ఆయన డెలాయిట్ ఇండియా మాజీ ఛైర్మన్, డెలాయిట్ గ్లోబల్ బోర్డు మాజీ సభ్యుడు. తన కెరీర్‌లో.. ఆయన ప్రముఖ భారతీయ, బహుళజాతి సంస్థలకు గవర్నెన్స్, రిస్క్ మేనేజ్‌మెంట్, ఫైనాన్షియల్ రిపోర్టింగ్ ప్రమాణాలు, రెగ్యులేటరీ కంప్లయన్స్‌పై సలహాలు ఇచ్చారు.
ఆయన ఎయిర్ ఇండియా, సిప్లా, నెస్లే ఇండియా, లార్సెన్ & టూబ్రో, క్రాంప్టన్ గ్రీవ్స్, ఐటీసీ హోటల్స్, సైయంట్, తేజస్ నెట్‌వర్క్స్, హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ వంటి అనేక ప్రముఖ లిస్టెడ్ అండ్ అన్‌లిస్టెడ్ కంపెనీల బోర్డులలో కూడా పనిచేసినట్లు సమాచారం. 2022-23 సంవత్సరానికి గాను ఏషియన్ సెంటర్ ఫర్ కార్పొరేట్ గవర్నెన్స్ & సస్టైనబిలిటీ ఆయనకు "బెస్ట్ ఇండిపెండెంట్ డైరెక్టర్" అవార్డును ప్రదానం చేసింది.
వృత్తిపరమైన సేవలలో తన నాయకత్వంతో పాటు.. రమేష్ భారతదేశంలో నియంత్రణ, విధాన సంభాషణలను తీర్చిదిద్దడంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన సెబీ, ఆర్‌బీఐ, ఐఆర్‌డీఎలకు అనుబంధంగా ఉన్న కీలక కమిటీలు, సలహా సంస్థలలో పనిచేశారు, తద్వారా వివిధ రంగాలలో పరిపాలన, ఆర్థిక ప్రమాణాల పరిణామంకు కూడా దోహదపడ్డారు.

వెర్స్ ఇన్నోవేషన్ సహ వ్యవస్థాపకుడు ఉమాంగ్ బేడి మాట్లాడుతూ..''కాలపరీక్షకు నిలబడే కంపెనీని నిర్మించడానికి పటిష్టమైన పాలన, ఆర్థిక క్రమశిక్షణ చాలా అవసరం. బోర్డు సారథ్యం, నియంత్రణ చట్రాలు, గ్లోబల్ ఆడిట్ నాయకత్వంలో పి.ఆర్. రమేష్‌కు సాటిలేని అనుభవం ఉంది. వెర్సే పరిణతి చెందుతూ.. సుస్థిర వృద్ధిపై తన దృష్టిని పదును పెడుతున్న తరుణంలో, మా పాలనా ప్రమాణాలను బలోపేతం చేయడంలో.. వాటాదారుల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఆయన దృక్పథం కీలక పాత్ర పోషిస్తుంది" అని అన్నారు.
ఈ సందర్భంగా రమేష్ మాట్లాడుతూ.. "భారతదేశ డిజిటల్ రంగంలో వెర్సె ఒక గణనీయమైన స్థాయి వ్యాపారాన్ని నిర్మించింది. ఆ స్థాయికి తగ్గట్టుగానే, పాలనా వ్యవస్థలు, ఆర్థిక నియంత్రణలు, రిస్క్ పర్యవేక్షణ కూడా వృద్ధికి అనుగుణంగా ఉండేలా చూసుకోవాల్సిన బాధ్యత కూడా వస్తుంది. బలమైన సంస్థలు కేవలం ఆవిష్కరణలపైనే కాకుండా, క్రమశిక్షణ, జవాబుదారీతనంపై కూడా నిర్మితమవుతాయి. ఈ సూత్రాలను మరింత బలపరచడానికి, నిరంతర, బాధ్యతాయుతమైన వృద్ధికి తోడ్పడే పాలనను రూపొందించడంలో సహాయపడటానికి, బోర్డు, యాజమాన్య బృందంతో కలిసి పనిచేయడానికి నేను ఎదురుచూస్తున్నాను" అని అన్నారు.
వెర్స్ ఇన్నోవేషన్‌లో.. రమేష్ ఆడిట్ కమిటీకి అధ్యక్షత వహించడంతో పాటు, ఆర్థిక నివేదికల సమగ్రత, అంతర్గత నియంత్రణలు, ఎంటర్‌ప్రైజ్ రిస్క్ మేనేజ్‌మెంట్, నియంత్రణ సమ్మతి, ఆడిట్ ప్రక్రియలను పర్యవేక్షిస్తారు. కంపెనీ కార్యాచరణ క్రమశిక్షణ, పాలనా వ్యవస్థలు మరియు దీర్ఘకాలిక విలువ సృష్టి ఫ్రేమ్‌వర్క్‌లను బలోపేతం చేస్తున్న తరుణంలో, ఆయన నియామకం బోర్డు పర్యవేక్షణ సామర్థ్యాలకు గణనీయమైన బలాన్ని చేకూరుస్తుంది.
వెర్స్ ఇన్నోవేషన్ ప్రైవేట్ లిమిటెడ్ గురించి
డిజిటల్ అంతరాన్ని తగ్గించడంలో టెక్నాలజీ సహాయపడుతుందనేదే.. వెర్స్ ఇన్నోవేషన్ ప్రధాన సూత్రం. ప్రారంభమైనప్పటి నుంచి, వెర్స్ సాంకేతికతను ఉపయోగించి లక్షలాది వినియోగదారుల తీరని కంటెంట్ అవసరాలను తీర్చే సవాలును స్వీకరించింది. దీని ప్రత్యేకమైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్ సాంకేతికతలు, వినియోగదారుల వినియోగ ప్రాధాన్యతల ఆధారంగా లక్షలాది వినియోగదారులకు వ్యక్తిగతీకరించిన కంటెంట్‌ను అందించడానికి వీలు కల్పిస్తాయి.
నేడు వెర్స్ ఇన్నోవేషన్ యొక్క సొంత టెక్నాలజీ ప్లాట్‌ఫామ్, భారతదేశవ్యాప్తంగా వందల మిలియన్ల మంది వినియోగదారులు డైలీహంట్‌లో తమ స్థానిక భాషలో కంటెంట్‌ను ఆస్వాదించేలా శక్తినిస్తోంది. దీని సాంకేతికత భారతదేశపు నెంబర్ 1, అత్యంత ఆకర్షణీయమైన క్రియేటర్స్ యాప్ అయిన జోష్‌కు కూడా శక్తినిస్తోంది. దీనికి అదనంగా.. వెర్స్ వద్ద నెక్స్‌వెర్సె.ఏఐ, డైలీహంట్ ప్రీమియం, జోష్ ఆడియో కాలింగ్ & ఆడియో స్టోరీస్ అండ్ వెర్సె కొలాబ్ వంటి ఏఐ-ఫస్ట్ ఉత్పత్తులు, ప్లాట్‌ఫామ్‌ల సమీకృత పోర్ట్‌ఫోలియో ఉంది. ఇవన్నీ కలిసి భారతదేశ డిజిటల్ ఆర్థిక వ్యవస్థలో వినియోగదారులు, కంటెంట్ మరియు బ్రాండ్‌లు పరస్పరం వ్యవహరించే విధానాన్ని పునర్నిర్మిస్తున్నాయి.
భారత్‌పై దృష్టి సారించిన తన యాప్‌ల శ్రేణితో.. వెర్స్ ఇన్నోవేషన్, స్థానిక భాషల టెక్ రంగంలో మొట్టమొదటి యూనికార్న్‌గా అవతరించింది. దీనిలో సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్, ఒంటారియో టీచర్స్ పెన్షన్ ప్లాన్ (OTPP), ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ (QIA), సిగులర్ గఫ్, కార్లైల్ గ్రూప్, బెయిలీ గిఫోర్డ్, గోల్డ్‌మన్ సాక్స్, గ్లేడ్‌బ్రూక్స్, ఫాల్కన్ ఎడ్జ్ క్యాపిటల్, ఆల్ఫావేవ్, సీక్వోయా క్యాపిటల్ ఇండియా, మ్యాట్రిక్స్ పార్ట్‌నర్స్ ఇండియా, గూగుల్, మైక్రోసాఫ్ట్, లూపా సిస్టమ్స్, లక్సర్ గ్రూప్, సోఫినా, బి క్యాపిటల్ గ్రూప్, ఐఐఎఫ్ఎల్, కోటక్, కాటమరన్, బే క్యాపిటల్, ఎడెల్‌వైస్ మరియు ఒమిడ్యార్ నెట్‌వర్క్ వంటి సంస్థలు ప్రస్తుత పెట్టుబడిదారులుగా ఉన్నాయి.


