ఇందిరమ్మ–2 | - | Sakshi
Sakshi News home page

ఇందిరమ్మ–2

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

జిల్లాకు మరో 5వేల ఇళ్లు జూన్‌ 2న శ్రీకారం చుట్టనున్న తెలంగాణ సర్కారు ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున తొలి విడత నిర్మాణాలు పూర్తిచేయాలని నిర్ణయం

కై లాస్‌నగర్‌: రెండో విడత ఇంది రమ్మ ఇళ్ల మంజూరుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చే స్తోంది. రాష్ట్ర ఆవి ర్భావ దినోత్సవం పురస్కరించుకుని జూన్‌ 2న శ్రీకారం చుట్టాలని భావిస్తోంది. సీఎం అధ్యక్షతన శనివారం నిర్వహించిన రాష్ట్ర కేబినెట్‌లో ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లు మంజూరు చేయాలని నిర్ణయించినట్లుగా రాష్ట్ర గృహ, రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈమేరకు జిల్లాకు ఈ విడతలో మరో ఐదు వేల ఇళ్లు మంజూరయ్యే అవకాశముంది. వీటిపై అ ర్హులైన నిరుపేదలు గంపెడాశతో ఎదురుచూస్తున్నా రు. కాగా మొదటి విడతకు సంబంధించిన నిర్మాణాలు నత్తనడకన సాగుతుండడం గమనార్హం.

నియోజకవర్గానికి 2వేల చొప్పున ..

సీఎం రేవంత్‌రెడ్డి రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు జూన్‌ 2న కుమురంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో శ్రీకారం చుట్టనున్నారు. తొలివిడత గృహ ప్రవేశాలతో పాటు రెండో విడత ఇళ్లకు భూమిపూజ చేయనున్నారు. మలి విడతలో ఒక్కో నియోజకవర్గానికి 2వేల చొప్పున ఇళ్లను కేటాయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన ఆదిలాబాద్‌, బోథ్‌ నియోజకవర్గాలకు కలిపి 4వేల ఇళ్లు మంజూరు కానుండగా ఆసిఫాబాద్‌ నియోజకవర్గ పరిధిలోకి వచ్చే గాదిగూడ, నార్నూర్‌, ఖానాపూర్‌ నియోజకవర్గాల పరిధిలోకి వచ్చే ఇంద్రవెల్లి, ఉట్నూర్‌ మండలాలకు కలిపి గతంలో ఒక్కో మండలానికి 200 చొప్పున మంజూరు చేసింది. ఈ లెక్కన జిల్లాకు 4800 నుంచి 5వేల వరకు మంజూరయ్యే అవకాశముంది. గతంలో మాదిరి ఎమ్మెల్యేలు ప్రభుత్వానికి ప్రత్యేక విజ్ఞప్తులు చేస్తే మరిన్ని మంజూరయ్యే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. కాగా ఇళ్ల మంజూరుపై మంత్రి పొంగులేటి ప్రకటనతో జిల్లాలోని అర్హులైన పేదల్లో ఆశలు చిగురిస్తున్నాయి. అర్హులై తొలి విడతలో వివిధ కారణాలతో ఇళ్లు రాని వారు ఈ విడతలో మంజూరు కోసం ఎదురుచూస్తున్నారు.

లబ్దిదారుల ఎంపికకు క్షేత్రస్థాయి సర్వే..

జిల్లా వ్యాప్తంగా ఇంటిస్థలం కలిగి ఇళ్లు లేనటువంటి వారు 80,233 మంది దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ తాజా ప్రకటనతో ఇందులో అర్హులను గుర్తించేందుకు అధికారులు ప్రత్యేక సర్వే చేపట్టారు. ఇందుకోసం వివిధ శాఖల మండల స్థాయి గెజిటెడ్‌ అధికారులు 111 మందిని నియమించారు. వీరికి ప్రత్యేక లాగిన్‌ ఐడీలు కేటాయించారు. సదరు అధికారులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి విచారణ చేపడుతున్నారు. ఇంటి నిర్మాణం వివరాలు, ప్రభుత్వ ఉద్యోగం, నెలకు వచ్చే ఆదాయం, కారు కలిగి ఉందా లేదా వంటి వివరాలపై ఆరా తీస్తున్నారు. వాటిని యాప్‌లో నమోదు చేస్తున్నా రు. వీటి ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేయనున్నట్లుగా అధికారులు చెబుతున్నారు.

జిల్లాలో మొదటి విడతలో

మంజూరైన ఇళ్ల వివరాలు ..

మంజూరైనవి : 16,106

మార్కౌట్‌స్థాయిలో : 1819

బెస్‌మెంట్‌ లెవల్‌ : 5219

రూఫ్‌లెవల్‌ : 2959

స్లాబ్‌ లెవల్‌ : 3026

పూర్తయినవి : 1477

ప్రారంభంకానివి : 1606

జిల్లాలో తొలివిడతలో మంజూరైన ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. ఈ విడతలో 16,106 ఇళ్లు మంజూరు కాగా ఇప్పటి వరకు కేవలం 1477 మాత్రమే పూర్తయ్యాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికీ 1606 ఇండ్లకు సంబంధించి కనీసం పునాదులు సైతం తీయలేదు. ఇందులో అత్యధికంగా ఆదివాసీలు, పీవీటీజీలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఆర్థికస్థోమత లేకపోవడం, అటవీశాఖ పరిధిలో స్థలాలు ఉండటం, పట్టాలు లేకపోవడం వంటి కారణాలతోనే నిర్మాణానికి ముందుకు రావడం లేదనే అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇక స్లాబ్‌, లెంటల్‌ లెవల్లో సాగుతున్న ఇళ్లలో రాష్ట్ర ఆవిర్భావం సందర్భంగా జూన్‌లో 1200 నుంచి 1400 గృహ ప్రవేశాలు నిర్వహించేలా హౌసింగ్‌శాఖ

ప్రయత్నిస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement