అ‘పూర్వ’ సమ్మేళనం | - | Sakshi
Sakshi News home page

అ‘పూర్వ’ సమ్మేళనం

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

ఆదిలాబాద్‌టౌన్‌: వారంతా దాదాపు మూడు దశాబ్దాల క్రితం కలిసి చదువుకున్నారు. తర్వాత ఉన్నత విద్య, ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడో స్థిరపడ్డారు. క ట్‌ చేస్తే.. మళ్లీ ఒకే చోటకు చేరారు. ఇందుకు సరస్వతమ్మ ఒడి వేదికై ంది. జిల్లా కేంద్రంలోని శ్రీసరస్వతి శిశుమందిర్‌ పూర్వ విద్యార్థుల సమ్మేళనం హౌసింగ్‌ బోర్డులో ఆదివారం నిర్వహించారు. 1997–98 బ్యాచ్‌కి చెందిన పదో తరగతి డి సెక్షన్‌ విద్యార్థులు ఆత్మీయంగా కలుసుకున్నారు. తమకు చదువు చె ప్పిన గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. అనంతరం పాఠశాలలో తిరుగుతూ నాటి జ్ఞాపకాలు గుర్తుకు తెచ్చుకున్నారు. తర్వాత అంతా కలిసి భోజనం చేశారు. ఆధ్యంతం ఆనందంగా గడిపారు. శిశుమందిర్‌లో చదవడం గర్వకారణంగా ఉందని, సమాజ సేవతో పాటు ఉత్తమ పౌరులను తయారు చేయడంలో శిశుమందిరాల పాత్ర గొప్పగా ఉంద ని పూర్వ విద్యార్థులు కొనియాడారు. కాగా ఈ స మ్మేళనానికి లండన్‌, హైదరాబాద్‌, కరీంనగర్‌, ని జామాబాద్‌ నుంచి దాదాపు 50మందిపాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement