పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన | - | Sakshi
Sakshi News home page

పెట్రో ధరలు తగ్గించాలని ఆందోళన

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

కై లాస్‌నగర్‌: కేంద్రం వరుసగా పెంచుతున్న పెట్రో ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్‌ చేస్తూ కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో ఆదివారం ఆందో ళన చేపట్టారు. జిల్లా కేంద్రంలో ప్రధాని మోదీ దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఐదు రాష్ట్రాల ఎ న్నికలు ముగిసిన వెంటనే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెంచి సామాన్యుడి నడ్డి విరుస్తుందని ఆరో పించారు. 2029లో రాబోయేది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని, రాహుల్‌ గాంధీ ప్రధానమంత్రి కావడం ఖాయమన్నారు. ఇందులో మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ అల్లూరి సంజీవరెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

బోథ్‌లో..

బోథ్‌: పెట్రో ధరల పెంపును నిరసిస్తూ బోథ్‌లో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మల్లెపూల సత్యనారాయణ ఆధ్వర్యంలో కాంగ్రెస్‌ శ్రేణులు ఆందోళన చేపట్టారు. ప్రధాని మోదీ దిష్టిబొమ్మ దహనం చేసి నిరసన తెలిపారు. ఇందులో మండల కన్వీనర్‌ శ్రీకాంత్‌ రెడ్డి, యువజన కాంగ్రెస్‌ నియోజకవర్గ ఉపాధ్యక్షుడు అనీష్‌ కుమార్‌, అంజయ్య, భోజన్న, రాజు రెడ్డి, యూసుఫ్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement