ఆదిలాబాద్‌టౌన్: పంట దిగుబడులను విక్రయించేందుకు రైతులు మార్కెట్ యార్డుల్లో ఎదుర్కొంటున్న సమస్యలపై ఎంపీ, ఎమ్మెల్యేలు దృష్టి సారించాలని బీఆర్‌ఎస్ సీనియర్ నాయకుడు నారాయణ అన్నారు. సీసీఐ భూముల అంశంపై చూపుతున్న శ్రద్ధను రైతు సమస్యల పరిష్కారంపై ఎందుకు చూపడం లేదని ప్రశ్నించారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శనగల కొనుగోళ్ల సమయంలో ఎదురైన సమస్యలు జొన్నల కొనుగోళ్లలో పునరావృతం కాకుండా మాజీ మంత్రి జోగు రామన్న రైతుల పక్షాన నిలబడి జిల్లా ఉన్నతాధికారులతో చర్చించినట్లు పేర్కొన్నారు. అయితే స్థానిక ఎంపీ, ఎమ్మెల్యేలు మాత్రం రైతు సమస్యలను పట్టించుకోకపోవడం విచారకరమన్నారు. ఇందులో నాయకులు ప్రహ్లాద్, రమేష్, రాజన్న, సతీ్‌జగదీష్, రాజు, కలీమ్ తదితరులు పాల్గొన్నారు.


