రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో సత్తా | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో సత్తా

May 25 2026 12:23 AM | Updated on May 25 2026 12:23 AM

ఆదిలాబాద్‌: రాష్ట్రస్థాయి ఈత పోటీల్లో జిల్లాకు చెందిన స్విమ్మర్‌ సత్తా చాటాడు. హైదరాబాద్‌లోని అంబర్‌పేట్‌ జీహెచ్‌ఎంసీ స్విమ్మింగ్‌ పూల్‌ వేదికగా ఆదివారం నిర్వహించిన ‘11వ తెలంగాణ సీనియర్‌ ఇంటర్‌ డిస్ట్రిక్ట్‌ స్విమ్మింగ్‌ చాంపియన్‌షిప్‌–2026’లో ఆదిలాబాద్‌ క్రీడాకారుడు వై.అనుదీప్‌ రాజ్‌ కాంస్య పతకం కై వసం చేసుకున్నాడు. 200 మీటర్ల బ్రెస్ట్‌ స్ట్రోక్‌ విభాగంలో ప్రతిభ చాటాడు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటడంపై జిల్లా స్విమ్మింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు సాయిని రవికుమార్‌, కార్యదర్శి కొమ్ము కృష్ణ, ట్రెజరర్‌ హరిచరణ్‌, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, జిల్లా ఒలింపిక్‌ సంఘం అధ్యక్షుడు గోవర్ధన్‌ రెడ్డి, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌, కోచ్‌ శ్రీనివాస్‌ గౌడ్‌ తదితరులు అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement