● ఆర్టీసీ ఆర్‌ఎం విజయభాను
ఆదిలాబాద్: ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడమే లక్ష్యంగా ఆర్టీసీ పనిచేస్తోందని ఆదిలాబాద్ రీజినల్ మేనేజర్ విజయభాను అన్నారు. జిల్లా కేంద్రంలోని డిపో శిక్షణ కార్యాలయంలో శుక్రవారం ఆయన మాట్లాడారు. ప్రయాణికులతో డ్రైవర్లు, కండక్టర్లు మర్యాదగా వ్యవహరించాలన్నారు. వృత్తిపరమైన ఒత్తిడి అధిగమించేందుకు సిబ్బంది ఆరోగ్య సంరక్షణపై దృష్టి సారించాలని సూచించారు. వ్యాయామం, ధ్యానం వంటివి అలవర్చుకోవాలన్నారు. ఏ చిన్న సమస్య ఎదురైనా వెంటనే డిపో మేనేజర్, డిప్యూటీ ఆర్‌ఎంలను సంప్రదించాలని సూచించారు. నిబద్ధతతో పనిచేస్తూ సంస్థ అభివృద్ధిలో భాగస్వాములు కావాలన్నారు. ఇందులో డిప్యూటీ ఆర్‌ఎం రామయ్య, అసిస్టెంట్ మేనేజర్ రాజశేఖర్,
ఎంఎఫ్ రాజేందర్ తదితరులు పాల్గొన్నారు.


