రైతులు డిమాండ్ చేసే పత్తి విత్తన కంపెనీల ప్యాకెట్లను మార్కెట్లో అందుబాటులో ఉంచాలి. ఏటా ఆ వైరెటీలు దొరక్క ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇతర కంపెనీల విత్తనాలు మార్కెట్లో పెద్ద ఎత్తున అందుబాటులో ఉన్నా రైతులు మాత్రం కొన్నిరకాలకు మాత్రమే ఆసక్తి చూపుతారు. – కృష్ణారెడ్డి,
భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా అధ్యక్షుడు
అన్ని రకాలు నాణ్యమైనవే..
జిల్లాలో ప్రైవేట్ కంపెనీలు డిమాండ్ మించి పత్తి విత్తనాల ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొ చ్చాయి. అన్నిరకాల సీ డ్స్ నాణ్యమైనవే. ఈ దృష్ట్యా రైతులు ఎలాంటి సంకోచం లేకుండా ఆ యారకాలను కొనుగోలు చేయాలి.– శ్రీధర్‌స్వామి,
జిల్లా వ్యవసాయ అధికారి, ఆదిలాబాద్


