‘మత మార్పిడిలను సహించేది లేదు’ | - | Sakshi
Sakshi News home page

‘మత మార్పిడిలను సహించేది లేదు’

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

ఆదిలాబాద్‌: మత మార్పిడిలను ఇకపై సహించేది లేదని ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. జిల్లా కేంద్రంలోని రైల్వేస్టేషన్‌ నుంచి ఢిల్లీకి వెళ్తున్న వనవాసీ కల్యాణ పరిషత్‌ కార్యకర్తలతో శుక్రవారం ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌తో కలిసి స మావేశమయ్యారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే మత మార్పిడిలు జరిగి జాతికి తీవ్ర అన్యాయం జరి గిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ నాయకత్వంలో ప్రస్తుతం న్యాయం జరుగుతుందన్నా రు. అనంతరం వారాహి హెల్పింగ్‌ హాండ్స్‌ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో రైల్వేస్టేషన్‌లో మజ్జిగ పంపిణీలో వారు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఫౌండేషన్‌ ఫౌండర్‌ శిరీష్‌, సభ్యులు మహేశ్‌, కిరణ్‌, ప్రవీణ్‌, సాయిప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement