నెన్నెల: ప్రమాదవశాత్తు మామిడి, టేకు చెట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు దహనమైన ఘటన మండల కేంద్రంలోని కొత్త పోశమ్మ సమీపంలో చోటు చేసుకుంది. బాధిత రైతు దూపం చందు తెలిపిన వివరా ల ప్రకారం.. కొత్తపోశమ్మ సమీపంలో చందు ఐదెకరాల్లో తొమ్మిదేళ్లుగా మామిడి, టేకు మొక్కలు పెంచుతున్నాడు. ఇందుకు కావాల్సిన బిందు సేద్యం ప రికరాలు సమకూర్చుకున్నాడు. శుక్రవారం ప్రమాదవశాత్తు చెట్లకు మంటలు అంటుకున్నాయి. మేక ల కాపరి ఇచ్చిన సమాచారం మేరకు చందు తోట కు వెళ్లేసరికి 120 మామిడి, 300 టేకు చెట్లతోపాటు డ్రిప్ గేట్ వాల్స్, పైపులు కాలిపోయాయి. సుమారు రూ.6లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు బాధితుడు తెలిపాడు. గుర్తు తెలియని వ్యక్తి నిప్పు పెట్టినట్లు అనుమానించి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు చెప్పాడు. ప్రభుత్వం పరిహారం అందించి ఆదుకోవాలని కోరుతున్నాడు.


