షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం | - | Sakshi
Sakshi News home page

షార్ట్‌ సర్క్యూట్‌తో పెంకుటిల్లు దగ్ధం

May 23 2026 12:16 AM | Updated on May 23 2026 12:16 AM

నెన్నెల: మండలంలోని మైలారం గ్రామంలో శుక్రవారం షార్ట్‌ సర్క్యూట్‌తో బొమ్మెన మురళీధర్‌గౌడ్‌కు చెందిన పెంకుటిల్లు పూర్తిగా దగ్ధమైంది. భూక్య చందు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. పంట పొలాల్లో వ్యవసాయ సామగ్రిని భద్రపర్చుకోవడానికి బాధిత రైతు కట్టుకున్న పెంకుటిల్లులో విద్యుత్‌ వైర్లు ఒకటికొకటి తగిలి షార్ట్‌ సర్క్యూట్‌ జరిగి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గ్రామపంచాయతీ సిబ్బంది అప్రమత్తమై అక్కడికి చేరుకుని పంచాయతీ ట్యాంకర్‌తో నీటిని చల్లి మంటలు ఆర్పివేశారు. అప్పటికే ఇల్లు పూర్తిగా కాలిబూడిదైంది. ఈ ప్రమాదంలో టేకు దుంగలు, వాసాలు, బోర్‌వెల్‌, డ్రిప్‌ పైపులు, స్టాటర్లు, ప్లాస్టిక్‌ పైపులు కాలి పోయాయి. సుమారు రూ.3లక్షల వరకు ఆస్తినష్టం జరిగినట్లు రెవెన్యూ అధికారులు అంచనా వేశారు. బాధితుడికి పరిహారం అందేలా చూస్తామని జీపీవో చందు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement