నెన్నెల: మండల కేంద్రంలో ఐకేపీ వీవోఏలు చేస్తున్న నిరవధిక సమ్మెలో పాల్గొన్న మెట్‌పల్లి గ్రామానికి చెందిన వీవోఏ దుగుట సంతోష్ శుక్రవారం దీక్షాశిబిరంలో వడదెబ్బతో సొమ్మసిల్లి పడిపోయాడు. గమనించిన తోటి వీవోఏలు అతడిని స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రానికి తీసుకెళ్లి చికిత్స అందించారు. వీవోఏలు తెలిపిన వివరాల ప్రకారం.. మెట్‌పల్లి నుంచి సంతోష్ బైక్‌పై ఎండలో 15కిలోమీటర్లు ప్రయాణించి దీక్షాశిబిరానికి చేరుకున్నాడు. 15 నిమిషాల త్వరాత దాహం వేస్తుందని, కళ్లు తిరుగుతున్నాయని చెప్పి పడిపోయాడు. చికిత్స అందించిన తర్వాత కోలుకున్నట్లు తోటి వీవోఏలు తెలిపారు. కాగా, ఐదురోజులుగా నిరవధిక సమ్మె చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని వీవోఏలు ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా స్పందించి సమస్యలు పరిష్కరించాలని కోరారు.


