కర్రసాములో శిక్షణ పొందుతున్న విద్యార్థులు
చెన్నూర్: వేసవి శిక్షణ శిబిరాలు విద్యార్థులకు సత్ఫాలితాలనిస్తున్నాయి. చెన్నూర్ పట్టణంలోని జిల్లా పరిషత్ బాలబాలికల ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన వేసవి శిక్షణ శిబిరంలో విద్యార్థినులు కర్ర సాములో శిక్షణ పొందుతూ రాటుదేలుతున్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సరిత ఆధ్వర్యంలో కరాటే ఇన్‌స్ట్రక్టర్ ఆర్.స్వామి, యోగా శిక్షకురాలు సరిత, చిత్రలేఖనంలో ఉపాధ్యాయుడు శంకర్ ఆయా అంశాల్లో శిక్షణ ఇస్తున్నారు. శిబిరంలో 7–10 ఏళ్ల విద్యార్థులకు ఉదయం 8నుంచి 10గంటల వరకు కర్రసాము, యోగా, చిత్రలేఖనంలో మెళకువలు నేర్పుతున్నారు. నిత్యం శిబిరానికి విద్యార్థులు ఉత్సాహంగా హాజరవుతున్నారు.
యోగాసనాలు వేస్తున్న విద్యార్థులు


