తలమడుగు: జాబ్‌కార్డున్న ప్రతీకూలీకి ఉపాధి కల్పించాలని పంచాయతీరాజ్ అడిషనల్ కమిషనర్ జాన్‌వెస్లీ అన్నారు. గురువారం మండలంలోని ఝరి, కొత్తూర్, గ్రామాల్లో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతీ కూలీకి రోజుకు రూ.300 కూలి వచ్చే వి ధంగా పని కల్పించాలన్నారు. పనిస్థలాల్లో కూ లీలకు వసతులు కల్పించాలన్నారు. పథకంలో ఎ లాంటి అవకతవకలు చోటు చేసుకోకుండా నిత్యం పర్యవేక్షించాలన్నారు. ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడంతో ఉదయం పూటనే పనులు చేపట్టాలని సూచించారు. కూలీల సంఖ్య పెంచాల ని సూచించారు. అనంతరం ఝరి గ్రామ స మీపంలో జరుగుతున్న వాటర్ షెడ్ చెక్‌డ్యామ్ పనులను పరిశీలించారు. నాణ్యత ప్రమాణాలు పాటించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఆర్‌డీఏ పీడీ రవీందర్ రాథోడ్, ఎంపీడీవో శంకర్, ఈజీఎస్ ఏపీవో మేఘమాల, ఈసీ ప్రవీణ్‌రావ్, తదితరులు పాల్గొన్నారు.


