కైలాస్‌నగర్: అటవీ అధికారుల వేధింపులు ఆపాలని డిమాండ్ చేస్తూ ఆదిలాబాద్ రూరల్ మండలంలోని అల్లికొరి గ్రామస్తులు గురువారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా తుడుందెబ్బ రాష్ట్ర అధ్యక్షుడు గోడం గణేశ్ మాట్లాడుతూ చిచ్‌ధరి నుంచి అల్లికొరి వరకు ప్రభుత్వం రూ.30 లక్షలతో బీటీరోడ్డు మంజూరు చేసిందన్నారు. అటవీ అధికారులు ఆ పనులు ప్రారంభం కాకుండా అడ్డుపడుతున్నారన్నారు. వర్షాకాలం ప్రారంభమవుతున్నందువల్ల వెంటనే రోడ్డు నిర్మాణ పనులను ప్రారంభించేలా చూడాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, ఆదివాసీలు పాల్గొన్నారు.


