కు.ని ఆపరేషన్లు చేయిస్తున్నాం | - | Sakshi
Sakshi News home page

కు.ని ఆపరేషన్లు చేయిస్తున్నాం

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

పట్టణంలో గుంపులుగా సంచరించే కుక్కలను ఎనిమల్‌ బర్త్‌ కేర్‌ సెంటర్‌కు తరలించి పశు వైద్యాధికారులతో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయిస్తున్నాం. కుక్కలను పట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన ఓ సంస్థకు బాధ్యతలు అప్పగించాం. వీధి కుక్కల కారణంగా పట్టణ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగు చర్యలు తీసుకుంటాం.

– బైరి శంకర్‌, శానిటరీ ఇన్‌స్పెక్టర్‌

ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా..

పిచ్చిపట్టిన కుక్కలకు కారుణ్య మరణం ప్రసాదించా లని, ఇతర వీధి కుక్కలను నియంత్రించాలని సుప్రీంకో ర్టు తీర్పునిచ్చింది. తీర్పుకు అనుగుణంగా ప్రభుత్వం నుంచి గైడ్‌లైన్స్‌ రా వాల్సి ఉంది. ప్రభుత్వం నుంచి వచ్చే తదుపరి ఆదేశాలకు అనుగుణంగా శునకాలపై తగు చర్యలు తీసుకుంటాం.

– జి.రమేశ్‌, జిల్లా పంచాయతీ అధికారి

Advertisement
 
Advertisement
Advertisement