కుక్కలకు కు.ని ఆపరేషన్లు | - | Sakshi
Sakshi News home page

కుక్కలకు కు.ని ఆపరేషన్లు

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

పట్టణాలు, పల్లెల్లో గుంపులుగా స్వైర విహారం చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడి వీధి కుక్కల కారుణ్య మరణానికి సుప్రీంకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌ అధికార యంత్రాంగం చర్యలపై అందరి దృష్టి

గత మూడేళ్లలో నమోదైన కుక్కకాటు వివరాలు ..

ఇచ్చోడలో గుంపులుగా సంచరిస్తున్న వీధి కుక్కలు

2025

2026 ఏప్రిల్‌ నెల వరకు

2024

2023

కైలాస్‌నగర్‌: ‘గౌరవంగా జీవించే హక్కు అంటే కుక్కకాటు భయం లేకుండా స్వేచ్ఛగా తిరిగే హక్కు కూడా.. చిన్నారులు, వృద్ధులు ప్రాణభయంతో బతకడాన్ని చూస్తూ ఊరుకోలేం’.. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు వెలువరించిన తీర్పు ఇది. ప్రజల పాలిట ప్రాణసంకటంగా మారిన వీధి కుక్కల నియంత్రణకు తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ప్రమాదకరమైన (పిచ్చిపట్టిన) వీధి కుక్కలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని తీర్పులో స్పష్టం చేసింది. ఈ నిర్ణయంతోనైనా జిల్లాలో వీధి కుక్కల బెడద తప్పుతుందా? అనే చర్చ మొదలైంది. శునకాల నియంత్రణకు జిల్లా అధికార యంత్రాంగం ఎలాంటి చర్యలు చేపట్టనుందనే అంశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది.

గుంపులుగా స్వైర విహారం

జిల్లాలో వీధి కుక్కల బెడద తీవ్రంగా ఉంది. పల్లె, పట్టణమనే తేడా లేకుండా ఎక్కడపడితే అక్కడ గుంపులు, గుంపులుగా స్వైర విహారం చేస్తూ ప్రజ లను భయాందోళనకు గురిచేస్తున్నాయి. వాటికి ఆహారం దొరక్కపోవడంతో చిన్నారులు, వృద్ధులు, మహిళలపై దాడి చేసి తీవ్రంగా గాయపరుస్తున్నాయి. దీంతో చిన్నారులు బయట తిరుగలేని పరిస్థితి. జిల్లాలో ఇటీవల రికార్డు స్థా యిలో ఉష్ణోగ్రతలు న మోదు కావడంతో ఎండ ల తీవ్ర త భగ్గుమంటో ంది. ఎండ వేడి తాళలేక మతిభ్రమించినట్లుగా పిచ్చిపట్టినట్లుగా వ్యవహరి స్తున్నాయి. వీధుల్లో స్వైరవిహారం చేస్తూ ప్రజలపై దాడులకు పాల్ప డుతున్నాయి. ఏటా కుక్కకా టు బాధితుల సంఖ్య పెరుగుతుండటం జిల్లాలోని పరిస్థితికి అద్దం పడుతోంది. ఇలా ప్రజల పాలిట ప్రాణాంతకంగా మారుతున్న వీధి కుక్కల బెడదను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలని, వాటిని ప్రత్యేక సెంటర్లకు తరలించా లని సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ప్రమాదకరమైన కుక్కలకు కారుణ్య మరణాన్ని ప్రసాదించాలని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు నిర్ణయంతోనైనా అధికార యంత్రాంగం స్పందించి వీధి కుక్కల బెడదను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.

సుప్రీంకోర్టు తీర్పుతోనైనా పరిస్థితి మారేనా?

సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో ప్రజల్లో హర్షం వ్యక్తమవుతోంది. అయితే అఽఽధికార యంత్రాంగం నిర్లీప్తతను విడనాడి శునకాలను కట్టడి చేసేలా షెల్టర్లకు తరలిస్తారా? లేక శస్త్రచికిత్సలు మరింత వేగవంతం చేస్తారా? అనేదానిపై సర్వత్రా చర్చ జరుగుతోంది. అంతు చిక్కని రోగాల బారిన పడుతున్న కుక్కల కారణంగా ప్రజలకు వ్యాధులు సోకే అవకాశముందని, కాటేస్తే ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదముందని వైద్యులు పేర్కొంటున్నారు. ఇప్పటికై నా అధికారులు వాటిపై ప్రత్యేక దృష్టి సారించి తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

జిల్లాలోని వీధి కుక్కల వివరాలు

జిల్లాలోని గ్రామ పంచాయతీలు : 473

వీధి కుక్కల సంఖ్య : 16,646

ఆదిలాబాద్‌ మున్సిపాలిటీలో వార్డులు : 49

వీధి కుక్కల సంఖ్య : 1,850

స్టెరిలైజేషన్‌ చేసిన కుక్కల సంఖ్య : 818

ఆదిలాబాద్‌ పట్టణంలో వీధి కుక్కలను నియంత్రించాలనే ఉద్దేశంతో బంగారుగూడలోని డంపింగ్‌యార్డులో ఐదేళ్ల క్రితం మున్సిపాలిటీ ఆధ్వర్యంలో రూ.80లక్షల వ్యయంతో ఎనిమల్‌ బర్త్‌ కేర్‌ సెంటర్‌ నిర్మించారు. అందులో కుక్కలకు కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు చేసేందుకు వీలుగా 52 గదులు నిర్మించారు. కుక్కలను పట్టేందుకు హైదరాబాద్‌కు చెందిన ఏనిమల్‌ కేర్‌ అనే సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు. ఒక్కో కుక్కకు రూ.1,650 చొప్పున చెల్లిస్తున్నారు. ఇప్పటి వరకు సుమారు 700 శునకాలకు శస్త్రచికిత్సలు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు. రెండున్నరేళ్లలో కేవలం 700 కుక్కలకు మాత్రమే ఆపరేషన్లు జరిగాయంటే వాటిపై అఽధికారులు ఎంత చిత్తశుద్ధితో ఉన్నారనేది స్పష్టమవుతోంది.

Advertisement
 
Advertisement
Advertisement