డోలాయమానం | - | Sakshi
Sakshi News home page

డోలాయమానం

May 22 2026 4:28 AM | Updated on May 22 2026 4:28 AM

ఈ రైతు పేరు కేమ రామయ్య. తాంసి మండలం వడ్డాడి. 15 రోజుల క్రితం తాంసి మార్కెట్‌కు జొన్నలు తీసుకొచ్చాడు. మూడు రోజుల క్రితం కాంటా జరిగింది. లారీలు రాకపోవడంతో సంచులను గోదాములకు తరలించలేని పరిస్థితి. జొన్నలను గోదాముకు తరలించే వరకు రక్షించే బాధ్యత రైతుదే. దీంతో దిక్కుతోచని పరిస్థితిలో అక్కడే ఉండాల్సిన దుస్థితి. వానాకాలం సీజన్‌కు తన చేనును సిద్ధం చేద్దామంటే అనువైన పరిస్థితులు కనిపించడం లేదు.

ఈ రైతు పేరు కుమ్ర విశ్వనాథ్‌. తాంసి మండలంలోని పాలోజి

గ్రామం. ఐదెకరాలు సొంతం ఉండగా, మరో ఐదెకరాలు కౌలుకు తీసుకొని పంటలు సాగు చేస్తున్నాడు. యాసంగిలో పండించిన జొన్న దిగుబడులు 25 క్వింటాళ్లు రాగా వాటిని అమ్ముకునేందుకు తిప్పలు పడాల్సి వస్తోంది. నాలుగు రోజుల క్రితం మార్కెట్‌కు తెచ్చి నిల్వలు ఉంచాడు. ఇప్పటికీ పాసింగ్‌ కాలేదు. దానికోసం పడిగాపులు కాస్తున్నాడు. వానాకాలం సీజన్‌ సమీపిస్తోంది. చేనును దుక్కిదున్ని సిద్ధం చేయాల్సి ఉంది. ఇంకా ఎన్నిరోజులు పడుతుందోనని మదన పడుతున్నాడు.

Advertisement
 
Advertisement
Advertisement