● అదనపు కలెక్టర్ చిత్రు
సాత్నాల: కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అదనపు కలెక్టర్ చిత్రు అన్నారు. భోరజ్ మండలం పిప్పర్‌వాడ జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఆయన బుధవారం సందర్శించారు. కొనుగోలు ప్రక్రియను పరిశీలించారు. రైతులతో మాట్లాడి కొనుగోళ్లు తీరు, తూకం, గన్నీబ్యాగుల నిల్వ పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు. లారీల కొరత కారణంగా సరిపడా గన్నీ బ్యాగులు లేక ఇబ్బందులు పడుతున్నట్లుగా వివరించారు. స్పందించిన ఆయన నిల్వలో ఉన్న బ్యాగులను వెంటనే తరలించేలా చూస్తానన్నారు. కొనుగోలు కేంద్రాల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. ఆయన వెంట తహసీల్దార్ రాజేశ్వరి, సర్పంచ్ సంతోష్‌రెడ్డి, రైతులున్నారు.


