ఆదిలాబాద్: బస్సుల నిర్వహణలో ఇంధన పొదుపు అత్యంత కీలకమని ఆర్టీసీ రీజినల్ మేనేజర్ డి.విజయ్‌భాను అన్నారు. ఆదిలాబాద్ డిపోలో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో ఉత్తమ పనితీరు కనబరిచిన డ్రైవర్లను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. మిగిలిన వారు కూడా ఆదర్శంగా తీసుకుని ముందుకు సాగాలన్నారు. డిపో పరిధిలో అత్యుత్తమ కేఎంపీఎల్ సాధించిన డ్రైవర్లు జావిద్, డి.రవీందర్, ఎం.ఆర్.జి రావు, హలీమ్ ను శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో డిపో మేనేజర్ జి. ప్రతిమారెడ్డి, ఏఈ శ్రీకర్, ఆర్‌ఎం కార్యాలయ ఏఎం రాజశేఖర్, డిపో సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


