ఉట్నూర్‌రూరల్: గిరిజన ప్రాంతాల అభివృద్ధికి కేంద్రం ప్రాధాన్యత ఇస్తోందని ఐటీడీఏ పీవో మకరందు అన్నారు. కేంద్రం ప్రభుత్వం చేపడుతున్న ‘జన్ భాగీదారి అభియాన్ – స బ్సే దూర్ సబ్సే పహలే’ కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన కార్యాలయ ప్రాంగణంలో ఇప్ప మొక్క నాటారు. గిరిజనుల సంక్షేమం, వారి జీవన ప్రమాణాల మెరుగుదల కోసం కేంద్రం అనేక కార్యక్రమాలను అమలు చేస్తోందని తెలిపారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు.కార్యక్రమంలో ఐటీడీఏ అధికారులు, సిబ్బంది, గిరిజన సంక్షేమ శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు.


