అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలి

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

ఆదిలాబాద్‌: అంగన్‌వాడీల సమస్యలు పరిష్కరించాలని సీఐటీయూ నాయకులు కోరారు. ఈ మేరకు ఆదిలాబాద్‌ ఎమ్మెల్యే పాయల్‌ శంకర్‌ను జిల్లా కేంద్రంలోని ఆయన క్యాంపు కార్యాలయంలో బుధవారం కలిసి వినతిపత్రం అందజేశారు. యూనియన్‌ జిల్లా కార్యదర్శి కిరణ్‌ మాట్లాడుతూ.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంగన్‌వాడీల సమస్యల పరిష్కారంలో చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. పెండింగ్‌ వేతనాలు వెంటనే చెల్లించాలని కోరారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షురాలు కె. సునీత, సీఐటీయూ సహాయ కార్యదర్శి సురేందర్‌, నాయకులు విమల, సుజాత, లక్ష్మి పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement