వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడి అరెస్ట్‌ | - | Sakshi
Sakshi News home page

వ్యవసాయ మోటార్ల చోరీ నిందితుడి అరెస్ట్‌

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

కడెం: మండలంలోని వివిధ గ్రామాల్లో వ్యవసాయ బావుల వద్ద విద్యుత్‌ మోటార్లను ఎత్తుకెళ్తున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు ఖానాపూర్‌ సీఐ సీహెచ్‌.అజయ్‌ తెలిపారు. బుధవారం కడెం పోలీస్‌స్టేషన్‌లో వివరాలు వెల్లడించారు. పెద్ద బెల్లాల్‌కు చెందిన మైస రాజ్‌కుమార్‌, పాత మద్దిపడగకు చెందిన విజిగిరి పుష్ప మోటార్లు చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారు. విచారణలో కొత్త మద్దిపడగకు చెందిన ఎలుకలపాట గంగారంను నిందితుడిగా గుర్తించి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి నాలుగు మోటార్లను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. సమావేశంలో కడెం, ఖానాపూర్‌ ఎస్సైలు పి.సాయికిరణ్‌, రాహుల్‌, పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement