జైనథ్: మండలంలోని బెల్లూరి గ్రామ శివారులో మంగళవారం రాత్రి కురిసిన గాలివానకు పంటచేలకు వెళ్లే ఎల్టీ విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. బుధవారం మేతకు వెళ్లిన గ్రామానికి చెందిన కొంగల రాకేశ్, దోడ సురేష్, వాగాడే బాలాజీకి చెందిన మూడు ఆవులు, గంగం పెద్దరాములుకు చెందిన ఎద్దు విద్యుత్ తీగలకు తాకడంతో షాక్‌కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. వాటి విలువ రూ.2 లక్ష ల వరకు ఉంటుందని బాధిత రైతులు తెలిపారు. సంఘటన స్థలాన్ని పశుసంవర్ధక శాఖ అధికారి వినోద్ దేశ్‌పాండే, తహసీల్దార్ ఆత్రం నారాయణ, విద్యుత్ శాఖ ఏడీ శ్రీనివాస్ పరిశీలించారు.


