తలమడుగు: వడదెబ్బతో ఒకరు మృతి చెందిన సంఘటన మండలంలో చోటు చేసుకుంది. బబాధిత కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం దేవాపూర్ గ్రామానికి చెందిన నాయని పోచన్న (30) వ్యవసాయ కూలీ. బుధవారం ఉదయం కూలీపనులకు వెళ్లాడు. చేనులో పనులు చేస్తుండగా కళ్లుతిరిగి కిందపడిపోయాడు. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో ఇంటికి తీసుకెళ్లారు. ఇంటివద్ద వాంతులు, విరేచనాలు చేసుకోవడంతో చికిత్స నిమిత్తం జిల్లా కేంద్రంలోని రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రాత్రి మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు.


