ప్రోత్సాహం.. ఉత్సాహం | - | Sakshi
Sakshi News home page

ప్రోత్సాహం.. ఉత్సాహం

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

● పీఎంశ్రీ స్కూళ్లలో ఈనెల 25 వరకు వేసవి శిబిరాలు ● జిల్లాలోని 16 పాఠశాలల్లో విద్యార్థులకు శిక్షణ

మంచిర్యాలఅర్బన్‌: వేసవిలో పీఎంశ్రీ పాఠశాలల్లో విద్యార్థుల సందడి నెలకొంది. సమ్మర్‌ క్యాంపులో భాగంగా ఇస్తున్న నైపుణ్య శిక్షణలో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొని కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు. ఉపాధ్యాయుల మార్గదర్శకంలో వివిధ నైపుణ్యాలను అభ్యసిస్తూ ప్రతిభను మెరుగుపర్చుకుంటున్నారు. ఉన్నత పాఠశాలల్లో 6 నుంచి 9వ తరగతుల విద్యార్థులకు విద్యతో పాటు సృజనాత్మకత, కళలు, క్రీడలు, జీవన నైపుణ్యాలను నేర్పిస్తున్నారు. సెలవుల్లో సెల్‌ఫోన్‌కు అతుక్కుపోకుండా సమ్మర్‌క్యాంపు వైపు వెళ్లేలా తల్లిదండ్రులు ప్రోత్సహిస్తున్నారు. జిల్లాలోని 16 పాఠశాలల్లో నిర్వహిస్తున్న ససమ్మర్‌ క్యాంపులో 100 మంది చొప్పున అవకాశం కల్పించారు. ఈ నెల 11న ప్రారంభమైన శిక్షణ 25న ముగియనుంది. స్టిచ్చింగ్‌, సంగీతం, నృత్యం, డ్రాయింగ్‌, యోగా, కథలు చెప్పటం, వ్యక్తిత్వ వికాసం, కంప్యూటర్‌ తరగతులు, ఆంగ్ల, గణిత భాషపై పట్టుసాధించడం, చెస్‌, ఇండోర్‌ గేమ్స్‌, సైన్స్‌ ప్రయోగాలు, క్రీడలు, క్విజ్‌, మాక్‌పార్లమెంట్‌, తదితర అంశాలపై తర్ఫీదు ఇస్తున్నారు. రాజీవ్‌నగర్‌ మోడల్‌స్కూల్‌లో 15 రోజుల పాటు నిర్వహించే సమ్మర్‌ క్యాంపులో విభిన్న అంశాలపై శిక్షణ పొందుతున్న విద్యార్థులు తమ అభిప్రాయాలను ఇలా ‘సాక్షి’తో పంచుకున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement