సరదాగా.. సరికొత్తగా.. | - | Sakshi
Sakshi News home page

సరదాగా.. సరికొత్తగా..

May 21 2026 2:11 AM | Updated on May 21 2026 2:11 AM

లక్ష్మణచాంద: వేసవి సెలవులను విద్యార్థులు సద్వినియోగం చేసుకునేలా తెలంగాణ ప్రభుత్వం సమ్మర్‌ క్యాంపులు నిర్వహిస్తోంది. విద్యార్థులు సరికొత్త విషయాలు నేర్చుకునే అవకాశం కల్పిస్తోంది. మండల కేంద్రంలోని పీఎంశ్రీ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11 నుంచి సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నారు. ఈనెల 25 వరకు విద్యార్థులకు వివిధ క్రీడల్లో శిక్షణ ఇస్తున్నారు. కబడ్డీ, ఖోఖో, చెస్‌, క్యారమ్‌, వాలీబాల్‌ తదితర క్రీడల్లో శివకుమార్‌, రాజు సంగీతం, నృత్యం సాత్విక నేర్పిస్తున్నారు. మండలంలోని వివిధ పాఠశాలలకు చెందిన 80 మంది విద్యార్థులు పాల్గొంటున్నారు. శిక్షణకు హాజరయ్యే విద్యార్థులకు ఉదయం స్నాక్స్‌ కూడా అందజేస్తున్నారు.

క్యారం ఆడుతున్న విద్యార్థినులు

కూచిపూడిపై ఆసక్తితో..

వేసవి శిక్షణ శిబిరంలో ఉచితంగా కూచిపూడి నృత్యం నేర్చుకుంటున్నా. శిక్షకులు చాలా బాగా నేర్పిస్తున్నారు. సమయం వృథా చేయకుండా ఆసక్తితో నేర్చుకుంటున్నా.

– రమణి, లక్ష్మణచాంద

నృత్యాన్ని ఇష్టంగా..

వేసవి సెలవుల్లో ఇంటివద్ద ఉండి సమయం వృథా చేయడం లేదు. మండల కేంద్రంలోని సమ్మర్‌ క్యాంపులో సాత్విక టీచర్‌ నృత్యం నేర్పిస్తున్నారు. ప్రతీరోజు క్లాసికల్‌ డ్యాన్స్‌ నేర్చుకుంటున్నా. – మాలతి, లక్ష్మణచాంద

క్యారమ్‌ ఆడుతున్నా

మండల కేంద్రంలోని సమ్మర్‌ క్యాంపులో క్యారమ్‌ నేర్చుకుంటున్నా. మా రాజు సార్‌ క్యారమ్‌, చెస్‌ ఆడడంలో మెలకువలు నేర్పిస్తున్నారు. ఆసక్తితో నేర్చుకుంటున్నా.

– మనోహర్‌, లక్ష్మణచాంద

కబడ్డీ ఆడుతున్న విద్యార్థులు

వాలీబాల్‌ నేర్చుకుంటున్న విద్యార్థులు

కబడ్డీ నేర్చుకుంటున్నా..

ఏటా వేసవిలో ఎండలో తిరిగే వాడిని. ఈసారి సమ్మర్‌ క్యాంపు నిర్వహిస్తున్నారు. ప్రతీరోజు ఉదయం 6 నుంచి 11 గంటల వరకు కబడ్డీ నేర్చుకుంటున్నా. మా శివకుమార్‌ సార్‌ ఆటలు మంచిగా ఆడిస్తున్నాడు.

– పవన్‌ కుమార్‌, లక్ష్మణచాంద

Advertisement
 
Advertisement
Advertisement