కోటపల్లి:నేటి ఆధునిక యుగంలో అనా రోగ్య సమస్యలకు చెక్ పెట్టాలంటే యో గాతోనే సాధ్యమని, ప్రతిఒక్కరూ యో గా చేసేలా వైద్యులు, ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఇందులో భాగంగా మండల కేంద్రంలోని మోడల్ స్కూ ల్‌లో సమ్మర్ క్యాంపులో భాగంగా చిన్నారులకు యోగాపై శిక్షణ ఇస్తున్నారు. రోజుకు గంటపాటు శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. ఈ నెల 1న ప్రారంభమైన శిక్షణ ఈ నెల 31 వరకు కొనసాగనుంది. శిక్షణతో విద్యార్థినుల్లో మానసిక ప్రశాంతత, ఆరోగ్యవంతమైన జీవనశైలి అలవడుతుందని, ఒత్తిడి దూరం చేస్తుందని శిక్షకుడు రాజారం పేర్కొంటున్నారు.
చదువుపై ఏకాగ్రత..
యోగా నేర్చుకోవడం వల్ల చదువుపై ఏకాగ్రత పెరుగుతోంది. మానసిక ప్రశాంతత లభిస్తోంది. అంతేకాక మనసు ఉల్లాసంగా ఉంటోంది. యోగా పోటీల్లో పాల్గొనేందుకు దోహదం చేస్తుంది. సమ్మర్‌లో యోగా నేర్చుకోవడం చాలా అనందంగా ఉంది. – భవ్యశ్రీ, కోటపల్లి
ఆసక్తిగా పాల్గొంటున్నారు
యోగా శిక్షణ తరగతులకు విద్యార్థులు ఆసక్తిగా హాజరవుతున్నారు. ఈ శిక్షణతో ఒత్తిడి తగ్గడమే కాకుండా శారీరక, మానసిక ఆరోగ్యానికి దోహదపడుతుంది. ఇక్కడ నేర్చుకున్న విద్యార్థులు మండల రాష్ట్ర, స్థాయి పోటీల్లో పాల్గొనేలా
శిక్షణ ఇస్తున్నా. – రాజారాం, ఇన్‌స్ట్రక్టర్
ఆనందంగా ఉంది..
సమ్మర్ క్యాంపులో భాగంగా మోడల్ స్కూల్‌లో యోగాపై ఉచితంగా శిక్షణ ఇవ్వడం ఆనందంగా ఉంది. చిన్ననాటి నుంచే యోగా నేర్చుకుంటే ఆరోగ్యంగా ఉంటారని తెలుసుకున్నా. ఇక్కడ నేర్చుకున్న యోగాను నా ఫ్రెండ్స్‌కు కూడా నేర్పిస్తున్నా. – కె.సాగరిక, కోటపల్లి


