బాసర: బాసర ఆర్జీయూకేటీలో 2026–27 విద్యాసంవత్సరానికి సంబంధించిన ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ఇందులో భాగంగా బుధవారం ప్రత్యేక కేటగిరీలకు చెందిన విద్యార్థుల ధ్రువపత్రాలు పరిశీలించారు. అడ్మిషన్ల ప్రక్రియలో పూర్తి పారదర్శకత పాటిస్తూ, ప్రభుత్వ నిబంధనల మేరకు అర్హులైన ప్రతిభావంతులకే సీట్లు కేటాయిస్తామని యూనివర్సిటీ వర్గాలు స్పష్టం చేశాయి. ఎంపికై న విద్యార్థుల వివరాలను యూనివర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు అధికారులు తెలిపారు. తాజా సమాచారం కోసం www.rgukt.ac.in వెబ్‌సైట్‌ను క్రమం తప్పకుండా సందర్శించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అడ్మిషన్ల విభాగం కన్వీనర్, కోకన్వీనర్, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొని వెరిఫికేషన్ ప్రక్రియ పర్యవేక్షించారు.


