నాడు బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు వందల కో ట్ల విలువైన ప్రభుత్వ భూ ములను పార్టీ కార్యాలయాల కోసం అక్రమంగా వినియోగించుకున్నారు. పేదల అవసరాల కో సం ఉపయోగించాల్సిన భూములను ఆక్రమించుకున్న బీఆర్‌ఎస్ పార్టీ విధానమే ఇప్పు డు అధికారంలో ఉన్న కాంగ్రెస్ కూడా కొనసాగిస్తోంది.
– పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఎమ్మెల్యే
140 ఏళ్ల చరిత్ర గల పార్టీ..
140 ఏళ్ల చరిత్ర గల పార్టీకి జిల్లా కేంద్రంలో పార్టీ కార్యాలయం లేదు. అన్ని జిల్లా కేంద్రాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మిస్తుండగా, ఆదిలాబాద్‌లోనూ స్థలం అన్వేషించాం. విజయ డెయిరీలో ఖాళీగా ఉన్న ఎకరం భూమిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నాం. దీనికి కేబినెట్ ఆమోదం లభించింది. ఎంత ధర కట్టే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఆదేశాలకు అనుగుణంగా ముందుకెళ్తాం.
– నరేశ్ జాదవ్, డీసీసీ అధ్యక్షుడు


