సుందరయ్యకు ఘన నివాళి | - | Sakshi
Sakshi News home page

సుందరయ్యకు ఘన నివాళి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

ఆదిలాబాద్‌టౌన్‌: సమసమాజం, సోషలిజం స్థాపనే సీపీఎం వ్యవస్థాపక నాయకుడు పుచ్చలపల్లి సుందరయ్యకు నిజమైన నివాళి అని పార్టీ జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేశ్‌ అన్నా రు. సుందరయ్య వర్ధంతిని పార్టీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. సుందరయ్య భవన్‌లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఆర్థిక, సామాజిక, రాజకీయ అసమానతలను పెంచిపోషించే దుర్మార్గపు వ్యవస్థను మార్చేందుకు యు వత, కార్మిక వర్గం సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలన్నారు. ఇందులో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కిరణ్‌, సీనియర్‌ నాయకులు దత్తాత్రి, జిల్లా కమిటీ సభ్యులు మంజుల, విష్ణు, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement