ఆదిలాబాద్‌టౌన్: డ్రగ్స్, గంజాయి నిర్మూలనకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపడుతున్నా రు. ఇందులో భాగంగా పట్టణంలోని బస్టాండ్, రైల్వే స్టేషన్, మార్కెట్ పరిసర ప్రాంతాల్లో నార్కోటిక్ జాగిలం రోమాతో మంగళవారం తనిఖీలు నిర్వహించారు. డ్రగ్స్, గంజాయి అక్రమ రవాణా, విక్రయాలను అరికట్టేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులు, వస్తువులు, బ్యాగులను క్షుణ్ణంగా తనిఖీ చేసి ప్రజలకు అవగాహన కల్పించినట్లు పేర్కొన్నారు. యువత డ్రగ్స్ బారిన పడకుండా తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.


