యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి | - | Sakshi
Sakshi News home page

యువతలో నైపుణ్యాభివృద్ధిపై దృష్టి

May 20 2026 12:05 AM | Updated on May 20 2026 12:05 AM

● కలెక్టర్‌ రాజర్షి షా

కై లాస్‌నగర్‌: యువతలో నైపుణ్యాలు పెంపొందించడంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. ప్రజాపాలన–ప్రగతిప్రణా ళిక 99రోజుల కార్యాచరణలో భాగంగా జెడ్పీ సమా వేశ మందిరంలో యువతకు కెరీర్‌ గైడెన్స్‌, స్కిల్‌ డె వలప్‌మెంట్‌పై మంగళవారం ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. యువత కేవలం ప్రభుత్వ ఉద్యోగాలపైనే ఆధారపడకుండా ప్రైవేట్‌ రంగంలో అవకాశాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఈ ఆర్థిక సంవత్సరంలో ఎస్సీ స్టడీసర్కిల్‌కు సొంత భవనం మంజూ రైందని వెల్లడించారు.ఇందులో డీవైఎస్‌వో శ్రీనివా స్‌,ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ మనోహర్‌, జిల్లా ట్రై బల్‌ స్పోర్ట్స్‌ ఆఫీసర్‌ పార్థసారథి, ఉట్నూరు, బీసీ, ఎస్సీ స్టడీ సర్కిల్‌ డైరెక్టర్లు ప్రవీణ్‌,రమేశ్‌ పాల్గొన్నారు.

ఆదిలాబాద్‌ పర్యాటక వైభవాన్ని చాటుదాం

ఆదిలాబాద్‌రూరల్‌: ఆదిలాబాద్‌ పర్యాటక వైభవా న్ని ప్రపంచానికి చాటుదామని కలెక్టర్‌ రాజర్షి షా అ న్నారు. మావల పార్క్‌లో మంగళవారం నిర్వహించిన ప్రెస్‌ టూర్‌ కార్యక్రమానికి ఆయన హాజరై మా ట్లాడారు. ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక పర్యాటక వారోత్సవాల్లో భాగంగా ‘ఇన్‌ఫ్లుయెన్సర్‌ రీల్స్‌ కాంపిటీషన్‌’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సోషల్‌ మీడి యా ఇన్‌ఫ్లుయెన్సర్లు, హ్యాండ్లర్స్‌ కంటెంట్‌ క్రియేటర్లు, మీడియా ప్రతినిధులు ఇందులో పాల్గొనవచ్చని తెలిపారు. ఆసక్తి కలవారు జిల్లాలోని పర్యాట క ప్రాంతాలు, ప్రకృతి అందాలు, జలపాతాలు, చా రిత్రక వైభవం, స్థానిక సంస్కృతిని ప్రతిబింబించేలా రీల్స్‌, వీడియోలు రూపొందించాలని సూచించారు. వాటిని ఈనెల 21 ఉదయం 11గంటలలోపు పెన్‌డ్రైవ్‌ ద్వారా జిల్లా కేంద్రంలోని విద్యుత్‌ తరంగిణి ఫంక్షన్‌ హాల్‌లో నేరుగా అందజేయాలని సూ చించారు. వివరాలకు 9440816087, 915417 0902 నంబర్లలో సంప్రదించవచ్చని పేర్కొన్నారు.

మత్స్యకారుల ఆర్థికాభివృద్ధే ధ్యేయం

ఉట్నూర్‌రూరల్‌: గిరిజన ప్రాంతాల్లోని మత్స్యకారు ల ఆర్థికాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోంద ని కలెక్టర్‌ రాజర్షి షా అన్నారు. మత్స్య శాఖ ఆధ్వర్యంలో ఉట్నూర్‌లోని కేబీ కాంప్లెక్స్‌ పీఎంఆర్సీ భవనంలో గిరిజన మత్స్య పారిశ్రామిక సహకార సంఘం సభ్యులకు మంగళవారం నిర్వహించిన ప్రత్యే క అవగాహన సదస్సుకు ఐటీడీఏ పీవో మకరందు తో కలసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మా ట్లాడుతూ, గిరిజన మత్స్యకారులు ఆధునిక చేపల పెంపక విధానాలను అలవర్చుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖ అధికారి లాయక్‌ మొహమ్మద్దీన్‌, ఆర్డీవో గంగాధర్‌, మత్స్య శాఖ అధికారులు, గిరిజన మత్స్య పారిశ్రామిక స హకార సంఘాల అధ్యక్షులు సభ్యులుపాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement