ఆదిలాబాద్‌టౌన్: పోలీసుల ప్రతిష్ట పెరిగేలా ప్రతి ఒక్కరూ విధులు నిర్వహించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. మంగళవారం సాయుధ సి బ్బందితో ప్రత్యేక సమావేశం నిర్వహించి వారి సమస్యలపై ఆరా తీశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ఎలాంటి సమస్యలున్నా నిర్భయంగా ఉన్నతాధికారులను సంప్రదించి సామరస్యంగా, చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు. ఇతరులకు షురిటీలు ఇచ్చే విషయంలో జాగ్రత్తలు పాటించాలని పేర్కొన్నారు. పలువురు సిబ్బంది తమ వ్యక్తిగత, శాఖాపరమైన సమస్యలను ఎస్పీ దృష్టికి తీసుకురాగా, పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో ఆదిలాబాద్ ఏఆర్ డీఎస్పీ కమతం ఇంద్రవర్ధన్, ఆర్‌ఐలు డి.వెంకటి, టి.మురళి, ఎన్.చంద్రశేఖర్, ఆర్‌ఎస్సైలు దేవేందర్, వినోద్, మహేశ్, గబ్బర్ సింగ్, ఆశన్న, ఏఆర్ ఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు తదితరులు పాల్గొన్నారు.


