బోథ్: జొన్నల కొనుగోలులో నిబంధనలు మార్చాలని డిమాండ్ చేస్తూ రైతులు మంగళవారం రోడ్డెక్కారు. మండల కేంద్రంలోని కోరమండల్ వద్ద రహదారిపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దిగుబడి పెరిగిన నేపథ్యంలో ఎకరానికి 10 క్వింటాళ్లు మాత్రమే కొనుగోలు చేయాలనే నిబంధనను తక్షణమే రద్దు చేయాలన్నారు. ఎకరాకు 20 క్వింటాళ్ల చొప్పున కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఆందోళనతో రహదారికి ఇరువైపులా ట్రాఫిక్ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని పోలీసులు నచ్చజెప్పడంతో వారు శాంతించారు. ఆందోళన విరమించారు.


