ఆదిలాబాద్‌రూరల్: స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) ఆర్చరీ అకాడమీకి ఆదిలాబాద్ రూరల్ మండలం చించుఘాట్ ఆశ్రమోన్నత పాఠశాలకు చెందిన పెందూర్ రూప ఎంపికై ంది. హైదరాబాద్ గచ్చిబౌలి అకాడమిలో అత్యున్నత ప్రమాణాలతో శిక్షణ ఇవ్వనున్నారు. గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి కె.పార్థసారధి మంగళవారం సదరు విద్యార్థిని స్వగ్రామం ఆదిలాబాద్ రూరల్ మండలం టేకిడిగూడకు వెళ్లి రూపతో పాటు ఆమె తల్లిదండ్రులను శాలువాతో సత్కరించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జాదవ్ ప్రేమ్‌దాస్, సర్పంచ్ మేస్రం అనసూయ షాకు, పటేళ్లు కుమ్ర రాజు, పెందూర్ సుంగు, ఆర్చరీ కోచ్ మారుతి పాల్గొన్నారు.


