ఆదిలాబాద్‌టౌన్: జిల్లాలో భానుడు భగ్గుమంటున్నాడు. ఉదయం 9 దాటిందంటే మండే ఎండతో ప్రతాపం చూపుతున్నాడు. రాత్రి 7 దాటినా వడగా లుల సెగ తగ్గడం లేదు. దీంతో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరో వారం రోజుల పాటు గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రమంతా హీట్‌వేవ్ అలర్ట్ ప్రకటించింది. ఉమ్మడి జిల్లా పరి ధిలోని ఆదిలాబాద్‌లో సోమవారం గరిష్ణ ఉష్ణోగ్రత 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా.. మంచిర్యాల, నిర్మల్‌లో 45.2 డిగ్రీలుగా నమోదైంది.
అప్రమత్తంగా ఉండాలి..
హీట్‌వేవ్ కారణంగా చిన్నారులు, వృద్ధులు, గర్భి ణులు, బాలింతలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. వడ గాలులుతో జనం బెంబేలెత్తుతున్నారు. ఉపాధికూలీలు పని ప్రదేశాల్లో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే భవన నిర్మాణ కార్మి కులు, వీధి వ్యాపారులు ఎండలోనే పనులు చేస్తూ బేజారవుతున్నారు. ఇప్పటికే పలువురు వడదెబ్బకు గురయ్యారు. కాగా పొచ్చెరలో సోమవారం 45.4 డిగ్రీల సెల్సియస్ నమోదు కాగా, జైనథ్‌లో44.6, భోరజ్‌లో 44.3, సిరికొండలో 44.2, ఇంద్రవెల్లి, గుడిహత్నూర్, ఆదిలాబాద్ పట్టణంలో 44 డిగ్రీలు గా నమోదయ్యాయి. మరోవైపు ఎండ తీవ్రత కారణంగా పట్టణంలో ఇటీవల ఐదు ద్విచక్ర వాహనా లు ఆహూతైన విషయం తెలిసిందే.


