రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది.. | - | Sakshi
Sakshi News home page

రాత్రి ఇక్కడే ఉండాల్సి వస్తుంది..

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

నేను మూడెకరాల్లో జొన్న సాగు చేసిన. చేతికొచ్చిన దాదాపు 70 క్వింటాళ్ల దిగుబడిని మార్కెట్‌కు తీసుకొచ్చాను. రెండు రోజుల నుంచి యార్డులో కుప్పలు పోసి ఉంచాను. మరో రెండు మూడు రోజుల వరకు కూడా కొనే పరిస్థితి కనిపించడం లేదు. పారీలు తెచ్చుకొని కప్పి ఉంచాను. రాత్రి ఇక్కడే పడుకుంటున్నాను.

– రాంరెడ్డి, రైతు, ఖోడద్‌

వచ్చి వారం రోజులైతంది..

ఈనెల 12న ఆదిలాబాద్‌ మార్కెట్‌కు 45 క్వింటాళ్ల జొన్నలు తీసుకొచ్చాను. కాంటా చేసినప్పటికీ లోడింగ్‌ కాకపోవడంతో ఇక్కడే ఉంటున్నా. యార్డులో కొందరు జొన్న పంట దొంగతనానికి పాల్పడుతున్నారు. పట్టీ ఇచ్చేవరకు ఇక్కడే ఉండాల్సి వస్తుంది.

– కృష్ణ, రైతు, రాంపూర్‌

రైతులకు ఇబ్బందులు

లేకుండా చర్యలు

కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు చేపడుతున్నాం. గన్నీ బ్యాగుల కొరత లేదు. ఇప్పటివరకు 70వేల క్వింటాళ్ల వరకు జొన్న పంట కొనుగోలు చేశాం. మరో 50వేల క్వింటాళ్ల వరకు యార్డుల్లో ఉంది. కొంత లేబర్‌ కొరత ఉంది. షెడ్యూల్‌ ప్రకారం రైతులు పంటను మార్కెట్‌కు తీసుకురావాలి.

– మహేశ్‌కుమార్‌, మార్కెటింగ్‌ డీఎం

Advertisement
 
Advertisement
Advertisement