మేమంతా సాత్నాల మండలంలోని బొరేగాం గ్రామస్తులం. గ్రామ ప్రవేశ ద్వారం వద్ద వంతెన నిర్మాణం లేక వర్షాకాలంలో రాకపోకలకు ఇబ్బందవుతుంది. గర్భిణులు, రోగులను అత్యవసర పరిస్థితుల్లో ఆసుపత్రులకు సైతం తరలించలేని దుస్థితి. త్వరగా వంతెన నిర్మించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
ఆ నోటిఫికేషన్ రద్దు చేయాలి
ఆదిలాబాద్ పట్టణంలోని పాత ఎస్సీ హాస్టల్ కు సంబంధించిన సర్వే నంబర్ 348లో గల 30 గుంటల స్థలాన్ని కాంగ్రెస్ పార్టీకి కేటాయిస్తూ ఆదిలాబాద్ అర్బన్ తహసీల్దార్ నోటిఫికేషన్ జారీ చేశారు. గతంలోనూ న్యూ అంబేడ్క ర్ భవనానికి సంబంధించిన స్థలంలో ఐసీడీఎస్ ఆధ్వర్యంలోని సీనియర్ సిటిజన్ భవనా న్ని కేటాయించారు. ఈ క్రమంలో తహసీ ల్దార్ నోటిఫికేషన్‌ను వెంటనే రద్దు చేసి ఆ స్థలాన్ని దళితుల అవసరాల కోసం పరిరక్షించాలి.
– దళితసంఘాల నాయకులు, ఆదిలాబాద్


