యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలి

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

ఆదిలాబాద్‌: యువత ఆరోగ్యంపై దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ అనూష అన్నారు. ‘ప్రజాపాలన–ప్రగతి ప్రణాళిక’లో భాగంగా స్థానిక ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వద్ద 5కే మారథాన్‌ రన్‌ను సోమవారం జెండా ఊపి ప్రారంభించారు. యువత, ప్రభుత్వ ఉద్యోగులు, వివిధ వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. అనంతరం విజేతలకు మెడల్స్‌, ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యం కోసం యోగా, ధ్యానం అలవర్చుకోవాలని సూచించారు. ప్రజల ఆరోగ్యం దృష్ట్యా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు చేపడుతోందని, కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ బోరంచు శ్రీకాంత్‌రెడ్డి, డీవైఎస్‌వో జక్కుల శ్రీనివాస్‌, డీఆర్డీవో రాథోడ్‌ రవీందర్‌, డీపీవో రమేశ్‌, సంక్షేమ అధికారి మిల్కా, గిరిజన క్రీడల అభివృద్ధి అధికారి పార్థసారథి, వివిధ క్రీడల కోచ్‌లు, అధికారులు, తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement