ఆదిలాబాద్‌టౌన్: ప్రజా ఫిర్యాదులను తక్షణ మే పరిష్కరించాలని ఎస్పీ అఖిల్ మహాజన్ పోలీస్ అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీ సు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 41 మంది ఎస్పీని కలిసి సమస్యలను విన్నవించారు. ఈ మేరకు సంబంధిత అధికారులతో ఎస్పీ ఫోన్ ద్వారా మాట్లాడి సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. వివిధ కేసుల పురోగతిపై ఆరా తీశారు. కార్యక్రమంలో ప్రజా ఫిర్యాదుల విభా గం అధికారి కవిత, సిబ్బంది పాల్గొన్నారు.


