కై లాస్‌నగర్: ఇందిరమ్మ బిల్లులు రావడం లేదని కొందరు.. పంట చేలకు విద్యుత్ సౌకర్యం కల్పించాలని మరికొందరు.. రహదారి సౌకర్యం కల్పించాలని మరికొందరు తమ సమస్యలను అధికారుల ఎదుట విన్నవించుకున్నారు. కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు మండుటెండను సైతం లెక్కచేయకుండా భారీగా తరలివచ్చారు. అదనపు కలెక్టర్లు ఎస్.రాజేశ్వర్, ఆర్‌ఎస్.చిత్రులకు తమ సమస్యలను నివేదించారు. అర్జీలు స్వీకరించిన ఉన్నతాధికారులు వాటిని సంబంధిత శాఖల అధికారులకు అందజేస్తూ త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. ఇందులో డీఆర్వో స్రవంతి, మున్సిపల్ కమిషనర్ జగదీశ్వర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈ వారం బాధితుల్లో కొందరి నివేదన..


