ఆదిలాబాద్‌టౌన్: బంగారు దుకాణాల్లో భద్రతా చర్యలు తప్పనిసరి పాటించాలని ఎస్పీ అఖిల్ మ హాజన్ అన్నారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సోమవారం బంగారు ఆభరణాల దుకా ణ నిర్వాహకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. దొంగతనాలను నివారించేందుకు దుకాణాల్లో సీసీ కెమెరాలు, మోషన్ సె న్సార్ అలర్ట్ సిస్టమ్, సైరన్ అలారం, సెన్సార్ పరికరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద దుకా ణా ల్లో ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందిని నియమించుకోవడంతో పాటు రాత్రి వేళల్లో నిఘా ఏర్పాటు చేసుకో వాలని సూచించారు. తెలిసిన వ్యక్తుల వద్ద మాత్ర మే బంగారం కొనుగోలు చేయాలని, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తప్పనిసరి చేయాలని పేర్కొన్నారు. ప్ర తిరోజూ డయల్ 100, పెట్రోలింగ్ సిబ్బంది ద్వారా గస్తీ నిర్వహిస్తున్నామని, అనుమానాస్పద వ్యక్తులు, దొంగల సమాచారాన్ని వెంటనే పోలీసులకు అందించాలని సూచించారు.ఇందులో డీఎస్పీ ఎల్. జీవన్‌రెడ్డి, వన్‌టౌన్ సీఐ బి.సునీల్‌కుమార్, వ్యాపారుల సంఘం అధ్యక్షుడు దేవిదాస్, ప్రతినిధులు రాజు, భాస్కరాచారి, బి.శ్రీనివాస్ పాల్గొన్నారు.
పోలీస్ అక్క సేవలు భేష్
జిల్లాలో బాల్య వివాహాలు అరికట్టేందుకు పోలీస్ అక్క, షీటీంల సేవలు అభినందనీయమని ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సిబ్బందితో సోమవారం సమావేశం నిర్వహించారు. 2026 సంవత్సరంలో ఇప్పటివరకు 26 బాల్య వివాహాలను నిలిపివేయగా, పోలీస్ అక్క బృందం 23, షీటీం 3 కేసుల్లో స్పందించి బాలికల భవిష్యత్తును కాపాడినట్లు తెలిపారు. పాఠశాలలు, గ్రామాలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కా ర్యక్రమాలు నిర్వహిస్తూ తల్లిదండ్రులకు చట్టాల పై అవగాహన కల్పిస్తున్నట్లుగా పేర్కొన్నారు. బాల్య వివాహాలు నిర్వహిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. గతనెలలో పోలీస్ అక్క సి బ్బంది 225 గ్రామాలను సందర్శించి 207 అవగా హన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. అలాగే 15 ఈవ్‌టీజింగ్ కేసులు నమోదు చేసినట్లు వివరించారు. బాల్య వివాహాలపై సమాచారం తెలి సిన వెంటనే డయల్ 100, స్థానిక పోలీస్ స్టేషన్‌కు సమాచారం అందించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశా రు. ఇందులో సీఐలు ప్రేమ్ కుమార్, కె.ఫణిదర్, షీటీం సిబ్బంది సుశీల, వాణిశ్రీ పాల్గొన్నారు.


