కై లాస్‌నగర్: జిల్లాలోని గిరిజన ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పలు ప్రాజెక్టులను చేపట్టినట్లు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. నీతి ఆయోగ్ సీఈవో సంబంధిత అదనపు కార్యదర్శులతో కలిసి 49వ ఈసీ ఆన్‌లైన్ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. కలెక్టరేట్ హాల్ కలెక్టర్ పాల్గొని జిల్లా పరిపాలన విభాగం సమర్పించిన రూ.5.79 కోట్ల విలువైన ప్రాజెక్టుల సమగ్ర నివేదికను వివరించారు. నార్నూర్ బ్లాక్‌లో శాసీ్త్రయ పద్ధతులు, మార్కెట్ లింకేజీల ద్వారా లక్క సాగు ప్రోత్సహించేందుకు రూ.40 లక్షల వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేశామన్నారు. ఇప్పటికే 12 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టు విజయవంతమైందని, మరో ఎనిమిది గ్రామాలకు విస్తరించి అమలు చేయనున్నట్లుగా తెలిపారు. తద్వారా సుమారు 370 గిరిజన కుటుంబాలకు లబ్ధి చేకూరనుందన్నారు. జిల్లాలో ఉపాధి అవకాశాలు మెరుగుపరచడానికి రూ.3.8 కోట్ల వ్యయంతో ‘వాడీ సాగు, సమగ్ర వ్యవసాయ ప్రాజెక్టు’ కింద బోర్‌వెల్స్ రీచార్జి నిర్మాణాలు, ఫార్మ్ పాండ్స్, తోటల పెంపకం వంటి పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ వీసీలో డీఆర్డీవో రవీందర్ రాథోడ్, నీతి ఆయోగ్ ప్రోగ్రాం అధికారి రాహుల్ తదితరులు పాల్గొన్నారు.
విస్తృతంగా రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు
కై లాస్‌నగర్: జిల్లాలో రెడ్ క్రాస్ సేవా కార్యక్రమాలను మరింత విస్తృతం చేసేలా సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. అదనపు కలెక్టర్ చాంబర్‌లో రెడ్‌క్రాస్ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని సోమవారం ఆయన ప్రారంభించి మాట్లాడారు. జిల్లాలోని అన్ని శాఖల అధికారులు, సిబ్బంది చొరవ చూపి సభ్యత్వం స్వీకరించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ ఆర్‌ఎస్ చిత్రు, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ గంగేశ్వర్, స్టేట్ ఎంసీ మెంబర్ విజయ్‌బాబు తదితరులు పాల్గొన్నారు.


