రసాభాసగా మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం | - | Sakshi
Sakshi News home page

రసాభాసగా మున్సిపల్‌ ప్రత్యేక సమావేశం

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

కైలాస్‌నగర్‌: ఆదిలాబాద్‌ మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రత్యే క సమావేశం సోమవారం రసాభాసగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ జిల్లా కార్యాలయ స్థలం కేటాయింపునకు సంబంధించిన ఎన్‌వోసీ, అర్బన్‌ చాలెంజ్‌ ఫండ్‌ రూ.20 కోట్లతో ఖానాపూర్‌ చెరువులో ఫ్లోటింగ్‌ సోలార్‌ ప్లాంట్‌ ఏర్పాటు, లాంగసాంగ్వీ పంప్‌హౌస్‌ వద్ద అధునాతన వసతులతో కూడిన మరో పంపు నిర్మాణం వంటి అజెండాతో ఈ సమావేశం నిర్వహించారు. చైర్‌పర్సన్‌ అనూష అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో బీజేపీ సభ్యుల ఆందోళన నడు మ అజెండాను ఆమోదించారు. కాంగ్రెస్‌ కార్యాలయానికి స్థలం కేటాయించవద్దంటూ ప్లకార్డులతో బీజేపీ కౌన్సిలర్లు నిరసన తెలిపారు. పోడియం ఎదుట నినాదాలు చేశారు. రాజకీయ పార్టీలకు ప ట్టణంలోని విలువైన స్థలాలను ఎలా కేటాయిస్తారని చైర్‌పర్సన్‌ను ప్రశ్నించారు. ఇందుకు ఆమె స్పందిస్తూ స్థలం తాము కేటాయించడం లేదని, రెవె న్యూ అధికారులు కేటా యించినట్లుగా తెలిపారు. దానికి ఎన్‌వోసీ ఇవ్వాల నే కలెక్టర్‌ ఆదేశాల మేరకు సమావేశం నిర్వహిస్తున్నట్లుగా స్పష్టం చేశారు. ఓ వైపు బీజేపీ కౌన్సిలర్లు ఆందోళన చేస్తుండగానే బీఆర్‌ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ కౌన్సిలర్లు అజెండా పాస్‌ అంటూ బయటకు వెళ్లిపోయారు. దీంతో బీజేపీ సభ్యులు కమిషనర్‌తో వాగ్వాదానికి దిగారు. అజెండా పత్రాలు చింపివేశారు. వన్‌టౌన్‌ సీఐ బలగాలతో అక్కడికి చేరుకున్నారు. అనంతరం చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ,24మంది అంగీకారంతో అజెండాకు ఆమోదం లభించినట్లుగా తెలిపారు. కాగా, ఎన్‌వోసీ ఇవ్వవద్దంటూ బీజేపీ కౌన్సిలర్లు సంతకాలు చేసి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement