విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

విద్యుత్‌ సౌకర్యం కల్పించాలి

May 19 2026 12:28 AM | Updated on May 19 2026 12:28 AM

మేమంతా నిరుపేద దళితులం. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దళితబస్తీ కింద 19 మందికి అందించిన వ్యవసాయ భూములను సాగు చేసుకుంటున్నం. యాసంగిలోనూ సాగు చేసేలా బోరుబావితో పాటు విద్యుత్‌ సౌకర్యం కల్పిస్తామని అప్పటి ప్రభుత్వం ప్రకటించింది. ఆ దిశగా చర్యలు చేపట్టినప్పటికీ విద్యుత్‌ స్తంభాలు సగం వరకే వచ్చాయి. త్వరగా కరెంట్‌ సౌకర్యం కల్పించాలని అధికారులకు విన్నవించాం.

– దళితబస్తీ లబ్ధిదారులు, పొచ్చెర, బోథ్‌

బిల్లులు రావడం లేదు

మేమంతా పీవీటీజీ తెగకు చెందిన ఆదివాసీ గిరి జనులం. కేంద్ర ప్రభుత్వ పీఎం జన్‌మాన్‌ పథ కం కింద రాష్ట్ర ప్రభుత్వం మాకు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసింది. పనులు ప్రారంభించి బెస్‌మెంట్‌, స్లాబ్‌ లెవల్‌ వరకు పూర్తి చేశాం. బిల్లులు రాకపోవడంతో పనులు చేయలేని పరి స్థితి. త్వరలో వర్షాకాలం ప్రారంభం కానున్నందున గుడిసెల్లో ఉంటున్న మాకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. త్వరగా బిల్లులు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.

– తోటి కులస్తులు, వాగాపూర్‌, మావల

Advertisement
 
Advertisement
Advertisement