రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు | - | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

చింతలమానెపల్లి: మండల కేంద్రంలోని పోలీస్‌ స్టేషన్‌, బాలాజీఅనుకోడ రైతువేదిక మధ్య రహదారిపై ఆదివారం రాత్రి జరిగిన ప్రమాదంలో ఇద్దరు గాయపడ్డారు. కానిస్టేబుల్‌ శ్రీకాంత్‌ విధి నిర్వహణలో భాగంగా బైక్‌పై అనుకోడ గ్రామానికి వెళ్తుండగా, బాలాజీఅనుకోడ నుంచి వస్తున్న దుర్గం రాము బైక్‌తో ఎదురెదురుగా ఢీకొన్నారు. ఇద్దరి కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై కమలాకర్‌ ఘటనా స్థలానికి చేరుకుని 108 వాహనానికి సమాచారం అందించారు. క్షతగాత్రులను చికిత్స కోసం కాగజ్‌నగర్‌కు తరలించారు.

Advertisement
 
Advertisement
Advertisement