వడదెబ్బతో మేకల కాపరి మృతి | - | Sakshi
Sakshi News home page

వడదెబ్బతో మేకల కాపరి మృతి

May 19 2026 12:10 AM | Updated on May 19 2026 12:10 AM

ఖానాపూర్‌:మండలంలోని గోసంపల్లె గ్రామానికి చెందిన మేకల కాపరి భూక్యా బాలయ్యనాయక్‌(54) వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ స భ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. బాలయ్య నా యక్‌ ఎప్పటిలాగే తన సొంత మేకలను గ్రామ శివారులోని సదర్మాట్‌ కాలువ వైపు మేతకు తీసుకెళ్లాడు. తీవ్ర ఎండల కారణంగా అక్కడే అస్వస్థతకు గురై కిందపడిపోయాడు. అటువైపు వెళ్లిన స్థానికులు గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కుటుంబీకులు పరిశీలించగా అప్పటికే మృతి చెందినట్లు గుర్తించారు. వడదెబ్బ కారణంగానే ఆయన మృతి చెందినట్లు గ్రామస్తులు భావిస్తున్నారు. మృతుడికి భార్య జమున, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

మత్తడిగూడలో మరొకరు..

ఉట్నూర్‌రూరల్‌: మండలంలోని మత్తడిగూడ గ్రా మానికి చెందిన కనక లచ్చు(52) సోమవారం వడదెబ్బతో మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలి పిన వివరాలప్రకారం..లచ్చు ఉదయం ఉపాధి పని కి వెళ్లి వచ్చాడు. సాయంత్రం విరేచనాలు కావడంతో కుటుంబ సభ్యులు 108కు సమాచారం అందించారు. సిబ్బంది చేరుకుని పరీక్షించగా అప్పటికే మృతి చెందాడు. మృతుడికి భార్య చందుబాయి, ఇద్ద రు కూతుళ్లు, కుమారుడు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement