జెడ్పీ సీఈవోగా రవి బాధ్యతలు | - | Sakshi
Sakshi News home page

జెడ్పీ సీఈవోగా రవి బాధ్యతలు

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

కైలాస్‌నగర్‌: జెడ్పీ సీఈవోగా బి.రవి సో మవారం జిల్లా పరి షత్‌ కార్యాలయ చాంబర్‌లో బాధ్యతలు స్వీకరించా రు. హన్మకొండ జెడ్పీ డిప్యూటీ సీఈవోగా పనిచేస్తున్న ఈయనకు పదోన్నతి కల్పించిన ప్రభుత్వం జిల్లాకు బదిలీ చేసింది. ఈ మేరకు బాధ్యతలు చేపట్టిన ఈయనకు కార్యాలయ అధికారులు, ఉద్యోగులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. రెగ్యులర్‌ అధికారి రాకతో ఏడు నెలలుగా కొనసాగిన ఇన్‌చార్జి పాలనకు తెరపడింది. అనంతరం కలెక్టర్‌ రాజర్షి షాను క్యాంపు కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.

Advertisement
 
Advertisement
Advertisement