లక్ష్యంగా జిల్లాలో డీజీపీ సుడిగాలి పర్యటన | - | Sakshi
Sakshi News home page

లక్ష్యంగా జిల్లాలో డీజీపీ సుడిగాలి పర్యటన

Apr 14 2026 8:04 AM | Updated on Apr 14 2026 8:04 AM

● ఆదిలాబాద్‌లో ట్రాఫిక్‌ పార్క్‌ ప్రారంభం ● మాజీ మావోలకు ఇళ్ల స్థలాలు పంపిణీ ● ఆదివాసీలతో మమేకమైన శివధర్‌రెడ్డి

ఆదిలాబాద్‌టౌన్‌/ఆదిలాబాద్‌/ఉట్నూర్‌రూరల్‌: రహదారి భద్రతకు ప్రాధాన్యం కల్పించడం..యువ త భవితకు చేయూత అందించడం.. ఆదివాసీలు, మాజీ మావోలకు భరోసా కల్పించడం లక్ష్యంగా డీజీపీ శివధర్‌రెడ్డి పర్యటన సోమవారం ఆదిలాబా ద్‌ జిల్లాలో సాగింది. జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పోలీసుల గౌర వ వందనం స్వీకరించారు. ముందుగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాలయం ఎదురుగా ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పార్క్‌ను ప్రారంభించారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో మైనర్‌ డ్రైవింగ్‌చేస్తూ పట్టుబడ్డ పిల్లల తల్లిదండ్రుల కు కౌన్సెలింగ్‌ నిర్వహించారు. ప్రయాణికుల భద్ర త దృష్ట్యా ఆర్టీసీబస్సుల్లో, పోలీసు కంట్రోల్‌ రూమ్‌లో సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఆదిలాబాద్‌రూరల్‌ మండలంలోని చించుఘాట్‌లో లైబ్రరీని ప్రారంభించి ఆదివాసీలతో సమావేశం నిర్వహించారు. వారితో కలిసి సామూహిక భోజనం చేశారు.

మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు..

తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దని డీజీ పీ సూచించారు. పోలీసు హెడ్‌క్వార్టర్స్‌లో తల్లిదండ్రులతో ఏర్పాటు చేసిన కౌన్సెలింగ్‌లో పలు విషయాలను వివరించారు. జిల్లాలో డ్రైవింగ్‌ చేస్తూ ప ట్టుబడ్డ 400 మంది మైనర్‌ పిల్లల తల్లిదండ్రులతో సమావేశం నిర్వహించారు. మైనర్లు డ్రైవింగ్‌ చే యడం ద్వారా ప్రమాదాలు చోటుచేసుకుంటాయని తెలిపారు.

ట్రాఫిక్‌ పార్క్‌ ప్రారంభం..

విద్యార్థి దశ నుంచే ట్రాఫిక్‌ నియమాలు అలవర్చుకునే విధంగా జిల్లా కేంద్రంలోని డీపీవో కార్యాల యం ఎదుట ఏర్పాటు చేసిన ట్రాఫిక్‌ పార్క్‌ను డీజీ పీ ప్రారంభించారు. పాఠ్య పుస్తకాల్లో ఉన్న పాఠ్యాంశాలను నేరుగా అర్థమయ్యే విధంగా దీన్ని రూపొందించారు. రోడ్డుపై ప్రయాణించే సమయంలో పాటించాల్సిన నిబంధనలు, సూచిక బోర్డులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించేలా పార్క్‌ను ఏర్పాటు చేశారు.

‘అభయ మై టాక్సీ ఈజ్‌ సేఫ్‌ 2.0’..

జిల్లా కేంద్రంలోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియం వేదికగా, ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా రూపొందించిన ‘అభయ మై టాక్సీ ఈజ్‌ సేఫ్‌ 2.0‘ కార్యక్రమాన్ని డీజీపీ ప్రారంభించారు. జిల్లాలో ఇప్పటికే 5వేలకు పైగా ఆటోలు నమోదు చేసుకోగా 500 మందికి గుర్తింపు పత్రాలను అందజేశారు.

ఆదివాసీలతో సామూహిక భోజనం..

చించుఘాట్‌లో నిరుద్యోగ యువత పోటీ పరీక్షలకు సిద్ధం కావడానికి ఏర్పాటు చేసిన అధునాతన లైబ్ర రీని ప్రారంభించారు. గుస్సాడీ వేషధారణలో డీజీపీ ఆదివాసీ ల కులదైవానికి ప్రత్యేక పూజలు చేశారు. మావలలో ఇంటెలిజెన్స్‌కు సంబంధించి నిర్మించిన క్వార్టర్లను ప్రారంభించారు.

సర్పంచులతో తీర్మానాలు..

గుడిహత్నూర్‌లోని ఎస్‌కన్వెన్షన్‌ హాల్‌లో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో 500 మంది రోడ్‌ సేఫ్టీక్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు. రహదారి భద్రత ని యమాలు పాటిస్తూ సురక్షితంగా గమ్య స్థానాలకు చేరుకోవాలని డీజీపీ సూచించారు. ఇందులో భాగంగా 36 గ్రామాల సర్పంచులు హెల్మెట్‌ ధరించడం, ట్రాఫిక్‌ నిబంధనలు పాటించడం, మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన కల్పించేందుకు తీర్మానాలు చేశారు.

నర్సాపూర్‌లో ఆర్‌వో ప్లాంట్‌ ప్రారంభం

ఆదివాసీల కోసం ఉట్నూర్‌ మండలం నర్సాపూర్‌ గ్రామంలో ఏర్పాటు చేసిన ఆర్‌వో ప్లాంట్‌ను డీజీపీ ప్రారంభించారు. మారుమూల ఆదివాసీ గ్రామాల అభివృద్ధి, ప్రజల ఆరోగ్య పరిరక్షణపై పోలీసుశాఖ ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. శుద్ధమైన తాగునీరు అందుబాటులోకి రావడంతో ఆరోగ్య పరిస్థితులు మెరుగుపడతాయని పేర్కొన్నారు. ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వెయ్యి మంది ఆదివాసీలకు వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఉట్నూర్‌ పోలీసు స్టేషన్‌లో 205 మంది యువతకు డ్రైవింగ్‌ మేళా ద్వారా లైసెన్సులను అందజేశారు. కార్యక్రమంలో ఐజీ గజరావ్‌ భూపాల్‌, కలెక్టర్‌ రాజర్షిషా, అదనపు కలెక్టర్‌ రాజేశ్వర్‌, ఎస్పీ అఖిల్‌ మహాజన్‌, అదనపు ఎస్పీలు బి.సురేందర్‌ రావు, పి.మౌనిక, శిక్షణ ఐపీఎస్‌ రాహుల్‌ కాంత్‌, డీఎస్పీ జీవన్‌ రెడ్డి, సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు.

సీసీ కెమెరాలు ఏర్పాటు చేసిన బస్సును ప్రారంభిస్తున్న డీజీపీ శివధర్‌రెడ్డి

ఇంటి స్థలం పట్టాలను అందజేస్తూ..

గతంలో పోలీసుల ఎదుట లొంగిపోయిన మాజీ మావోయిస్టు సభ్యులకు డీజీపీ ఇంటి స్థలం పట్టాలను పంపిణీ చేశారు. పోలీస్‌ హెడ్‌క్వార్టర్స్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో బోథ్‌ దళానికి చెందిన కుమురం సుశీల, కొమురం సక్కుబాయిలకు పిట్టలవాడలో ఇంటి స్థలాలు, అలాగే అల్లంపల్లి ఫైరింగ్‌ ఘటనలో అమరుడైన పోలీసు కానిస్టేబుల్‌ జె.ముకుంద్‌రావు కుటుంబానికి ఇంటి స్థలం పట్టా అందజేశారు.

Advertisement
 
Advertisement
Advertisement